టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా బుధవారం కీలక మ్యాచ్ ఆడనుంది. సెమీస్‌లో చోటు లక్ష్యంగా బంగ్లాదేశ్‌తో మధ్యాహ్నం 1.30కి అడిలైడ్‌లో తలపడనుంది. బలాబలాలు, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. అయితే సంచలనాలు నమోదు చేయగల సత్తా బంగ్లాకు ఉంది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు సమిష్టిగా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఉదయం 9.30కి జింబాబ్వే, నెదర్లాండ్స్ మ్యాచ్ జరగనుంది.