తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడు, రాజేష్ లను సిఐడి అక్రమంగా అరెస్టు చేయడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెమ్ నాయుడు ఖండించారు. దీనిపై అయన మాట్లాడుతూ.... ఇది బీసీలపై జరిగిన దాడి. జగన్ హింస విధానం పై ప్రజల పక్షాన ప్రశ్నించడం నేరంగా తెలుగుదేశం పార్టీ నాయకులను వేధిస్తున్నారు. ప్రజా వ్యతిరేక చర్యల పై పోరాడటం ఘోరంగా, ప్రజల హక్కులు పరిరక్షణకు పూనుకోవడం ద్రోహంగా భావించి అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కుతున్నారు. జగన్ మార్క్ దురాగతాలు, దురన్యాయాలు ఫాసిస్ట్ పాలనకు నిదర్శనం .జగన్ పాలనా విధ్వంస పురాణం అంతులేనిది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న అయ్యన్నపాత్రుడు కుటుంబంపై జగన్ రెడ్డి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని అన్నారు.