పులివెందుల వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల పనులను డిసెంబరు చివరి నాటికి పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆదేశించారు. బుధవారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఆమె పులివెందుల మెడికల్ కళాశాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో అక్కడ జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిసెంబరు చివరి నాటికి పనులు పూర్తిచేయాలన్నారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి రజని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు, జేసీ సాయికాంత్ వర్మ, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa