కడప జిల్లా వ్యాప్తంగా 19 ప్రాంతాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు, 21 ప్రాంతాలలో ఇంటింటి న్యాయ ప్రచారాలను గురువారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతీయ న్యాయసేవా అధికార సంస్థ, న్యూఢిల్లీ వారి ఆదేశానుసారంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ వారి సూచనల మేరకు స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాల సందర్భంగా అక్టోబర్ 31వ తేదీ నుండి నవంబర్ 13వ తేదీ వరకు నిర్వహించే పాన్ ఇండియా క్యాంపెయిన్ లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గురువారం ఎస్ కవిత సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వారు కడప నగరంలో ఉన్న ప్రభుత్వ బాలుర వసతి గృహము, ప్రభుత్వ పరిశీలన గృహము, పురుషుల కేంద్రకారాగారం, అలంకంపల్లి, అంగడి వీధి, నాగరాజు పేట, ఆకుల వీధి, పద్మావతి ఓల్డ్ ఏజ్ హోమ్, తదితర 21 ప్రాంతాలలో 865 మందికి చట్టాల పట్ల, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పథకాల పట్ల అవగాహన కలిగించారు.
ఈ కార్యక్రమంలో పేరా లీగల్ వాలంటరీలు, లా విద్యార్థినీ విద్యార్థులు, ఎన్జీవోలు, అంగన్వాడి టీచర్లు, పంచాయతీ శాఖ ఉద్యోగులు, ప్యానెల్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.