ఓ బస్సు డ్రైవర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసిన మేడికొండూరుకు చెందిన ఇద్దరు పోలీసుల పై ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గురువారం సస్పెన్షన్ వేటు వేశారు. పేరేచర్ల జంక్షన్ వద్ద ఇటీవల ఓ బస్సు ముందుగా వెళుతున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైంది. దీంతో బస్సును సిబ్బంది స్టేషన్ కు తరలించారు. ఆ బస్సుకు రాత్రంతా కాపలా ఉన్నామని రూ. 4వేల వరకు డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేసి కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేశారు.