పోర్న్ వెబ్ సైట్ ఓపెన్ చేసిన 83 ఏళ్ల వ్యాపారవేత్తకు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. ''నువ్వు పోర్న్ సైట్ తెరిచాయి. ఇండియాలో ఇది చట్టవిరుద్దం. వెంటనే డబ్బులు పంపించు. లేకుంటే అరెస్ట్ చేస్తాం." అని కంప్యూటర్ స్క్రీన్ మీద సందేశం పంపి బెదిరింపులకు దిగారు. ఈ విషయం బయటకు పొక్కితే పరువు పోతుందుని భావించిన ఆ వృద్ధ వ్యాపార వేత్త.. మొదట రూ.50 వేలు చెల్లించారు. అయినా తరచుగా డబ్బు డిమాండ్ చేస్తుండటంతో పోలీసులను ఆశ్రయించారు. ముంబైలోని బాంద్రాలో జరిగిందీ ఘటన.