రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఓటర్ నమోదు జరుగుతుందని ఈ సారి కొత్తగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి ఓటు హక్కు కల్పించారని ఇదే అదునుగా భావించి అన్నమయ్య జిల్లాలో బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని పి డి ఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకన్న తెలిపారు. స్వయంగా ఎన్నికలలో పోటీ చేసే ఎమ్మెల్సీ అభ్యర్థి వారి అనుచరులు వాలంటీర్లు రంగంలోకి దిగి బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని వాటిని అడ్డుకట్ట వేయాలని ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలని లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో ఆదివారం పాత్రికేయుల సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు.
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అడ్డదారిలో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నకిలీ ఓట్ల నమోదుకు అడ్డు చెబుతున్నారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతారని భావించి ముందుగానే ఇలా ఆకస్మికంగా అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామల్ ను బదిలీ చేశారని, ప్రవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి గత ఆరేళ్లలో కనీసం మూడేళ్లు పీఎఫ్ జమ చేసిన తదితర వివరాలు దరఖాస్తులు నమోదు చేయాలని పేర్కొన్నారు.