విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని , జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, దేశంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నవంబర్ 25న చలో పార్లమెంట్ ను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం రాయచోటి పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయం నందు ఏఐఎస్ఎఫ్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు తుమ్మల లవకుమార్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్ట ప్రకారం11 జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రంలో ప్రారంభించినా నిధులు కేటాయించకపోవడం వలన భవనాలు మొండి గోడలకే పరిమితమయ్యాయనీ అన్నారు. ఈ తరుణంలో ఉపాధి హక్కులను కల్పించడానికి భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయి మెంట్ గ్యారెంటీ యాక్ట్ బిల్లును తీసుకురావడానికి, నూతన విద్యా విధానం పేరుతో విద్యా కాషాయ కరణ కుట్రలను తిప్పి కొట్టడానికి ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం నూతన జాతీయ విద్యా విధానం 2020 బిల్లును రద్దు చేయాలని తదితర సమస్యల సాధనకై చలో పార్లమెంట్ మార్చ్ కు పిలుపులో భాగంగా విద్యార్థి యువత మేధావులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.