కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా ప్రాంగణంలో ఈ నెల 5న గుర్తు తెలియని వ్యక్తులు 2. 04 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ బ్యాటరీలు ఫ్యాన్లను చోరీ చేసినట్లు మేనేజర్ శ్రీదేవి ఫిర్యాదు చేయగా సిఐ ఉలసయ్య ఎస్సై శ్రీ రామకృష్ణ దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం పదిమంది నిందితులను గుర్తించి వీరిలో ఆదివారం 7 మందిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి రూ. 1, 57, 000 విలువైన ఎలక్ట్రానిక్ బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు.