చేబ్రోలు మండలం గుండవరం గ్రామానికి చెందిన మెరుగ కోటేశ్వర రావు, వయస్సు 76 సం. లు, రిక్షా నడుపుకొని జీవిస్తుంటాడు. ఇతని కొడుకులు అయిన మేరుగ శివ శంకర్, మేరుగ శ్రీను లు తనని ఇంట్లోకి రానివ్వడం లేదని, అన్నం కూడా పెట్టడం లేదని ఇబ్బంది పెడుతున్నారని, అలాగే తన అల్లుడు అయిన సాతర్ల వెంకటేశ్వర్లు కూడా 50 వేల రూపాయలు ఇవ్వాలని, అడిగితే బెదిరిస్తున్నాడని గుంటూరు జిల్లా ఎస్పీ వద్ద స్పందన గ్రీవెన్స్ నందు రిపోర్ట్ ఇవ్వగా, సదరు స్పందన రిపోర్ట్ పై చేబ్రోలు ఎస్సై వై సత్యనారాయణ ఆదివారం రాత్రి సీనియర్ సిటిజెన్ యాక్ట్ క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవలసిన భాద్యత వారి పిల్లలపై ఉన్నాదని, అలా వృద్దాప్యంలో ఉన్నతల్లిదండ్రులను పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై వై. సత్యనారాయణ తెలియజేశారు.