నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 12న తమిళనాడు-పుదుచ్చేరి మధ్య అల్పపీడనం తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు ఎల్లుండి ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa