బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది.