నెల్లూరు జిల్లాలోని డైకాస్ రోడ్డు ఓవెల్ స్కూల్లో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల విద్యార్థినిపై పీఆర్వో బ్రహ్మయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా తరగతి గదుల్లోకి తీసుకెళ్లి విద్యార్థినిని బ్రహ్మయ్య ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. బ్రహ్మయ్య వేధింపులు శృతి మించడంతో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయంపై ప్రశ్నించగా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బ్రహ్మయ్యపైన అనేక ఆరోపణలు ఉన్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. బ్రహ్మయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.