ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వానికి లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసులు జారీ చేసింది. ఏపీ అధికారులు తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ నెల 8న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలని ఓం బిర్లా లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎంపీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి లోక్ సభ సెక్రటేరియట్ మంగళవారం నోటీసు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa