దేశంలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అధికారులు ఎన్నిచర్యలు తీసుకున్నా డ్రగ్స్ దందా ఆగడం లేదు. తాజాగా పంజాబ్ లూథియానా జిల్లాలోని దుగ్రీ ప్రాంతంలో ఓ డ్రగ్ డీలర్ ను పట్టుకున్నారు. అతని నుండి 20 కిలోల హెరాయిన్, నల్లమందు, రూ.5.5 లక్షల నగదు, బుల్లెట్లు, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని కోర్టులో హాజరు పరచి, 6 రోజుల NCB కస్టడీకి తీసుకున్నామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.