ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. మండలం మకలవిలక్కు యాత్ర లో భాగంగా ప్రధాన అర్చకుడు ఎన్.పరమేశ్వరన్ నంబూద్రి ఆధ్వర్యంలో ఆలయ ద్వారాలను తెరిచారు. కరోనా కారణంగా గత రెండేల్లు రోజుకు 30 వేల మంది భక్తులనే అనుమతించామని, ఈ ఏడాది భక్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితులు లేవని ఆలయ అధికారులు ప్రకటించారు. తొలిరోజు 30 వేల మంది స్వామిని దర్శించుకున్నారు.