మక్కల్ నిది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ చెన్నైలోని అన్నానగర్ లోని ఒక హోటల్లో పార్టీ రాష్ట్ర నిర్వాహకులు, జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా, ఇతర పార్టీలతో పొత్తు ఉంటుందా అనే విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని, పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగుతామని తెలిపారు.