దేశంలో టీవీలు లేని ఇళ్లు చాలా అరుదు. పేద, మధ్య తరగతి అందరి ఇళ్లల్లోనూ ఇది సాధారణ వస్తువుగా మారిపోయింది. కేబుల్, డిష్ నెట్ వర్క్స్ తో టెలివిజన్ రంగం బాగా విస్తరించింది. ఓటీటీల రాకతో మరింత బలోపేతం అయ్యింది. 2021 నాటికి భారత్ లో 21 కోట్ల ఇళ్లల్లో టీవీలున్నట్లు కేపీఎంజీ అనే సంస్థ సర్వేలో వెల్లడైంది. 2026 నాటికి ఈ సంఖ్య 26 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు.