అక్రమ మద్యం రవాణా, నాటుసారా, మట్కా, అక్రమ ఇసుక రవాణా వంటి వాటిని అరికట్టేందుకు నిఘా పెంచా లని సెబ్ ఏఎస్పీ రామ్మోహన్ రావు ఆదేశించారు. గుంతకల్లు సబ్ డివి జన్ పోలీసు కార్యాలయంలో బుధ వారం డిఎస్పీ యు. నరసింగప్ప ఆధ్వర్యంలో అక్రమ మద్యంపై సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్సై ల తో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యం, ఇసుక రవాణా కేసులలో పట్టుబడిన వాహనాలను సాధ్యమైనంత త్వరగా వేలం పాట నిర్వహించాలన్నారు. పట్టుబడిన అక్రమ మద్యాన్ని సెబ్ అధికారుల నుండి అనుమతులు తీసుకుని వాటిని ధ్వంసం చేయాల న్నారు. పెండింగులో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో సబ్ డివిజన్ సిఐలు వెంకటరామిరెడ్డి, హరనాథ్, రామసుబ్బయ్య, మహేశ్వర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.