భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 (1) లో ప్రతి పౌరునికి మాట్లాడే హక్కు, భావ ప్రకటన హక్కు, సభలు, సమావేశాలు, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కుతోపాటు ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడం, నిరసన తెలపడం భారత రాజ్యాంగం కల్పించిందని సిపిఐ మండల కార్యదర్శి తిప్పన ప్రసాద్, సహాయ కార్యదర్శి సామాగంగయ్య అన్నారు. చిట్వేల్ మండలం రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రజల హక్కులకు భంగం కలిగించే పోలీసులు 30 చట్టాన్ని ఎత్తేయాలని గురువారం నిరసన తెలిపి ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేశారు. 30 చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలను పోలీసులు తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు శంకరయ్య, జనార్ధన, నారాయణ, మధు, సురేషు తదితరులు పాల్గొన్నారు