ప్రభుత్వ విభాగాల్లో 30 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం కేవలం 75 వేల మందికే నియామక పత్రాలు ఇచ్చిందని విమర్శించారు. పీఎంవో కిందకు వచ్చే సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ విభాగాల్లోనే 1,600కు పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. కేంద్ర విధానాలతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు.