భారత్ తరపున టెస్టులు, వన్డేల్లో ఆడుతున్న యువఆటగాడు శుభ్ మన్ గిల్ ప్రస్తుతం టీ20ల్లోనూ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా గిల్ తన బ్యాటింగ్ మంత్రాన్ని వెల్లడించాడు. సిక్స్ లు కొట్టడం అనేది వ్యక్తిగత బలంపై కాకుండా టైమింగ్ పై ఆధారపడి ఉంటుందన్నాడు. క్రీజ్ లో కుదురుకుంటే సిక్స్ లు కొట్టవచ్చని అభిప్రాయపడ్డాడు. సిక్స్ లేదా ఫోర్ ల కోసమే చూడకుండా డాట్ బాల్స్ ని తగ్గించి స్ట్రైక్ రొటేట్ చేయడం ముఖ్యమని వెల్లడించారు.