విశాఖపట్నంలోని బీచ్‌లకు జీవీఎంసీ 44 మంది లైఫ్‌గార్డులను నియమించింది. బీచ్ లను సురక్షితంగా ఉంచేందుకు, బీచ్ ల వద్ద ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా భద్రత కోసం ఈ రెస్క్యూ టీంలను నియమించింది. అంతేకాకుండా సముద్రంలోకి వెళ్లేవారికి రక్షణ పరికరాలు సైతం అందిస్తామని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాజబాబు తెలిపారు.