కర్నూలుకు న్యాయ రాజధాని కావాలని ప్రశ్నిస్తే చెప్పు తీసుకొని కొడతానంటావా చంద్రబాబూ అంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ది చెందాలనే ఆలోచనతో ముందుకు వెళ్తుంటే .. చంద్రబాబు 29 గ్రామాలే బాగుండాలని వికేంద్రీకరణ వద్దు, తన అమరావతే ముద్దు.. అని ప్రజలను మభ్యపెట్టే పరిస్థితికి వెళ్తున్నాడు. తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు.వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టే పథకాలు, జగన్ గారి ఆలోచన, వైయస్ జగన్ గారి పనితీరు .. ఏ దేశ చరిత్రలో అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా ఇంతలోతుగా, క్షేత్రస్థాయిలో, సామాజిక స్పృహతో అధ్యయనం చేశారా..? ప్రశ్నించారు.