ఇటీవల విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మీ పేరేమిటీ అని ప్రశ్నించడంపై ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు వివరణ ఇచ్చారు. 'సహజంగా పార్టీకి సంబంధించిన సమావేశాలు జరిగినప్పుడు పరియచంతో ప్రారంభం అవుతాయి. అధ్యక్షుడు అయినా.. ఎవరైనా ఫస్ట్ పేరు చెప్పాలి. నేను అధ్యక్షుడిగా ఫస్ట్ చైర్‌లో కూర్చుంటా. అప్పుడు పరిచయం చేసుకోమంటారు. ఈ మీటింగ్‌లో కూడా అందరం పరియచం చేసుకున్నాం. అందరూ పేర్లు చెప్పారు. ఎవరికీ పేర్లు తెలియక కాదు. అక్కడున్న సీనియర్స్.. మీ కెబినెట్‌లో నేను ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నాను అని ఒకాయన అన్నాడు. ఆయను మోదీకి తెలుసు. అయినా.. అందరూ పేర్లు చెప్పి పరిచయం చేసుకోవడం అనేది సిస్టమ్‌లో నేచరల్' అని సోము వీర్రాజు వివరించారు.
'కన్నా లక్ష్మీనారాయణతో గ్యాప్ ఏం లేదు. అవన్నీ అపోహలు మాత్రమే. ఎవరేమన్నా అన్ని పార్టీ చూసుకుంటుంది. దేనికి పని చేస్తాను అన్నది పార్టీ డిసైడ్ చేస్తుంది. పార్టీ ఏమైనా అంటే.. ఫీల్ అవ్వాలి కానీ.. నాయకులు అంటే పట్టించుకోను. పార్టీని పెంచే విషయంలో స్పష్టమైన బ్లూ ప్రింట్ నా మైండ్‌లో ఉంది. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. చాలా వేగంగా అడుగులు వేస్తూ.. పార్టీని బలోపేతం చేస్తా. తప్పకుండా బీజేపీలో చేరికలు భారీగా ఉంటాయి. తెలంగాణతో పోల్చి చూసే పరిస్థితి ఏపీలో లేదు. వైసీపీలో ఎందుకు చేరుతున్నారో అందరికీ తెలుసు. మాకు స్పష్టమైన ప్రణాళిక ఉంది. దాని ప్రకారమే ముందుకు వెళ్తాం' అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
'టీడీపీ ఒక ఫ్యామిలీ పార్టీ. అందుకే టీడీపీతో మేం కలవబోం. టీడీపీతో నేను వెళ్లిపోతాను అని పవన్ ఎక్కడా చెప్పలేదు. మేం కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తాం. మేం తెలుగుదేశంతో కలవబోం అని.. పవన్‌కు ఢిల్లీ పెద్దలు స్పష్టంగా చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మాతోటే ఉండాలి. ఉండను అని అనరు. ఉండేటట్లుగా కుటుంబ రాజకీయాలు ఎంత ప్రమాదమో పవన్‌కు చెప్తూనే ఉంటాం. మా దగ్గరే వారిని ఉండేటట్లుగా చేసుకుంటాం. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది.. కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అమరావతిలోనే రాజధాని ఉండాలనేది మా పార్టీ విధానం' అని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
'చాలామంది ముఖ్యమంత్రి అభ్యర్థిపై తొందరపడుతున్నారు. కానీ.. పవన్‌కు, బీజేపీకి ఆ తొందర లేదు. స్పష్టమైన అవగాహనతో ఉన్నాం. మేం ఇద్దరం కలిసి కొంతమందితో మైండ్ గేమ్ ఆడుతున్నాం. ఆ మైండ్ గేమ్ నుంచి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. జగన్ గురించి స్మూత్‌గా ఏం మాట్లాడం. అనేక అంశాలపై ప్రశ్నించాం. చంద్రబాబు బీజేపీ ఎదగకుండా పనిచేశారు. ఆయనతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి నష్టం జరుగుతుంది. అందుకే చంద్రబాబు గురించి నా మైండ్‌లో బ్లూ ప్రింట్ పెట్టుకున్నా. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది. చాలామందిని మేం కలుస్తాం. మా ప్రయోజనాలు మాకుంటాయి. బాంబులు పేలుస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా బాంబులు పేలుస్తాం' అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.