ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో సిమెంట్ రోడ్డు నిర్మించేందుకు ఆదివారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా ప్రభుత్వం అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మెహనూర్, మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, వార్డు ఇంచార్జి షేక్ నూరి, పలువురు వార్డు కౌన్సిలర్లు, వైసిపి నాయకులు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.