యావత్తు ప్రపంచానికి కోవిడ్ తరువాత పలు రకాల వైరస్ లు దాడి చేస్తున్నాయి. తాజాా తమిళనాడును ఓ కొత్త వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా తమిళనాడులో 'మద్రాస్ ఐ' ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సెప్టెంబర్ మెుదటి వారం నుంచి ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. తమిళనాడులో ప్రతి 10 మందిలో ఇద్దరు లేదా ముగ్గురు ఈ వైరస్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు జాగ్రత్తలు వహించినప్పటికీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
తమిళనాడు రాజధాని చెన్నై కేంద్రంగా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మద్రాస్ ఐ సోకిన వారు నాలుగు రోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. డాక్టర్లు సూచించిన మెడిసిన్ మాత్రమే వాడాలని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 'మద్రాస్ ఐ' ను మనం కండ్ల కలక అని పిలుస్తాం. కంటి వాపు, ఎరుపు, కంటి నుంచి నీరు కారటం మద్రాస్ ఐ యొక్క లక్షణాలు. కుటుంబసభ్యుడు ప్రభావితమైతే 4 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ముగిసే సమయానికి కండ్లకలక కేసులు ఎక్కువవుతాయి. ఈ సంవత్సరం చెన్నై నగరంలో భారీ వర్షాలు కురిసాయి. దీంతో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. నగరంలో దాదాపు 20 శాతం మంది ప్రజలు ఈ మద్రాస్ ఐ వైరస్‌తో బాధపడుతున్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
మద్రాస్ ఐ అనేది ఒక వ్యక్తి నుండి మరొకరికి వేగంగా వ్యాపించే వైరస్. ఇది తరచుగా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది కంటి నుండి స్రావాల ద్వారా వ్యాపిస్తుంది. టవల్స్, దిండు కవర్లు, మేకప్ వస్తువులు వంటి వ్యక్తిగత వస్తువుల ద్వారా ఇది ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. ఈ మద్యాస్ ఐ వైరస్ సోకిన వారికి కంటి నుంచి నీరు బయటకు రావడం, కళ్ళు ఎర్రబడటం, జిగటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందికి కళ్లు వాచిపోయి ఉబ్బెత్తుగా తయారవుతాయి. ఇది సాధారణం కంటి ఇన్ఫెక్షన్ అయినప్పటికీ., వెంటనే చికిత్స చేయకపోతే ఇది మరింత తీవ్రమైన సమస్యగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చాలామంది ఫార్మసీ నుండి యాంటీబయాటిక్స్ ప్రయత్నించిన తర్వాత డాక్టర్ వద్దకు వస్తారని..,కానీ అలా చేయకూడదని అంటున్నారు. కంటి నిపుణుడిచే సూచించబడిన యాంటీబయాటిక్స్, కంటి చుక్కలను మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa