అమూల్ పాలసేకరణ ధరను పెంచారు. నేటి నుంచి రాయలసీమ జిలాల్లో పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అమూల్ పాలసేకరణ ధరను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా రాయలసీమ జిల్లాల్లో లీటర్ గేదె పాలపై రూ.2.47, లీటర్ ఆవు పాలపై రూ.1.63 చొప్పున పెంచింది. కిలో ఘనపదార్థాలకు రూ.7.9 నుంచి రూ.9.5 కు పెంచింది. దీంతో లీటర్ ఆవుపాలకు చెల్లిస్తున్న ధర రూ.30.50 నుంచి రూ.32.13 కి పెరిగింది. లీటర్ గేదె పాలకు చెల్లిస్తున్న ధర రూ.42.50 నుంచి రూ.44.97కు పెరిగింది. జగనన్న పాలవెల్లువ కింద ఈ పాలను సేకరిస్తున్న విషయం తెలిసిందే.