ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మనాన్నలు గొడవపడ్డారని.. కుమారుడి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 25, 2022, 12:48 PM

తల్లిదండ్రులు మాట్లాడుకోవటం లేదని మానసికంగా కృంగిపోయిన ఓ చిన్నారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ లోని ఉరవకొండకు చెందిన ఈశ్వరసాయి (17) ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అమ్మనాన్నలు మాట్లాడుకోవటం లేదని కొన్నాళ్లుగా మదనపడుతున్న విద్యార్థి, గురువారం హాస్టల్ రూంలోకి వెళ్లి ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ‘ప్రియమైన అమ్మానాన్నలకు నేను ఇలా చేసుకోవడం తప్పే. కానీ తప్పడంలేదు. ఇప్పటికైనా ఇద్దరు కలిసి ఉండి మాట్లాడుకోండి. మళ్లీ జన్మ ఉంటే మీ కొడుకుగానే పుడతాను’ అంటూ విద్యార్థి రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com