దొంగతనం చేసిన కేసులో, దొంగసొత్తు కలిగి ఉన్న నేరానికి ముద్దాయి బలగ హరిబాబు ఉరఫ్ హరికి రెండు సంత్సరాల ఆరు నెలలు జైలుశిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తూ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె. రాణి గురువారం తీర్పు చెప్పారని శ్రీకాకుళం గ్రామీణ ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం కరజాడ గ్రామానికి చెందిన బలగ అప్పన్న ఇంట్లో 2019 ఏప్రిల్ 2న నల్లపూసల తాడు, బంగారు ఉంగరం దొంగిలించినట్లు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్ఐ లక్ష్మణ్ దర్యాప్తు జరిపారు. ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. సుశీల వాదించారు.