భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెనుకొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ నియోజకవర్గంలోని రొద్దం , పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లోని కోగిర , గొల్లపల్లి , పందిపర్తి రెవెన్యూ గ్రామాల పరిధిలో దాదాపు 500 మంది భూమిలేని నిరుపేదలు 2000 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్నారని వీరందరికీ సాగు నమోదు చేసి ప్రస్తుత భూ పంపిణీలో సాగు మేరకు అసైన్మెంట్ చేసి ప్రతి పేదవానికి భూ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం చూపాలని కోరారు. అనంతరం గ్రామాల వారిగా వినతి పత్రాలను సబ్ కలెక్టర్ కె. కార్తీక్ కు సమర్పించడం జరిగింది. సబ్ కలెక్టర్ స్పందించి ప్రతి అర్జీ ఆధారంగా మండల తహసీల్దార్ లతో సంప్రదించి విచారణ కు ఆదేశించి అర్హులైన ప్రతి ఒక్కరికి అసైన్మెంట్ చట్టం ప్రకారం భూ పంపిణీ చేయడానికి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా ప్రతి అర్జీకు ఎండార్స్మెంట్ ద్వారా సమాచారం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంగాధర్ , సోమందేపల్లి మండలం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రంగప్ప , సోమందేపల్లి సిఐటియు నాయకులు కొండా వెంకటేశులు , సాగుదారులు కిష్టప్ప , నరసింహులు , నారాయణ , యశోదమ్మ , గంగాదేవి , సరోజమ్మ , జయంతి , రామాంజనమ్మ , రాజు , బైలాంజనేయులు , బాబు తదితరులతో పాటు 200 మంది పాల్గొనడం జరిగింది.