చైనాలో జీరో కొవిడ్ పాలసీపై జరుగుతోన్న నిరసనలపై అక్కడి ప్రభుత్వం ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతోంది. ఆందోళనకారులను పోలీసులు భారీ సంఖ్యలో అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని తక్షణం డిలీట్ చేయాలని ఆదేశిస్తున్నారు. ప్రధాన నగరం షాంఘైలో నిరసనకారులు ఆంక్షలపై గళమెత్తుతున్నారు. అయితే శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై అణచివేత చర్యలకు దిగొద్దని ఐరాస హితవు పలికింది. మరోవైపు చైనాలో సోమవారం 39,452 కేసులు నమోదయ్యాయి.