డిజిటల్ రూపాయి(e-రూపాయి)ని డిసెంబర్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, ఎస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ బ్యాంకుల ద్వారా ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌లలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా వ్యాపారులు, పరిమిత కస్టమర్లకు డిజిటల్ రూపాయి అందుబాటులోకి రానుంది. e-రూపాయి అనేది డిజిటల్ టోకెన్. బ్యాంకుల ద్వారా e-రూపాయి పంపిణీ చేయబడుతుంది. అర్హత కలిగిన బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ ద్వారా ఇ-రూపాయితో లావాదేవీలు చేయొచ్చు.