ఏపీ హైకోర్టు అమరావతిలోనే కొనసాగుతుందని సోమవారం సుప్రీంకోర్టు సాక్షిగా ప్రభుత్వ న్యాయవాది చెప్పడంపై సీమప్రాంత ప్రజాప్రతినిధులు సమష్టి ప్రకటన చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అమరావతిలోని హైకోర్టును (జ్యుడిషియల్ క్యాపిటల్) రాయలసీమలోని కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నామని, కేంద్ర న్యాయశాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు చెప్పిన విషయాన్ని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యోగ సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థి సంఘాలతో పాటు ప్రజలందరూ స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.