ప్రయాణీకుల భద్రతే ధ్యేయంగా రైల్వే శాఖ పనిచేస్తోందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు అరుణ్‌కుమార్ జైన్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గుత్తి నుంచి రేణిగుంట వరకు పలు రైల్వేస్టేషన్ల తనిఖీ, రైళ్ల వేగం పరీక్షలు, పలు ప్రారంభోత్సవాలను ఆయన మంగళవారం చేపట్టారు. కడప రైల్వేస్టేషన్‌కు మంగళవారం సాయంత్రం చేరుకున్న ఆయన ముందుగా రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కడప రైల్వేస్టేషన్ పరిధిలో గల ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రైల్వే ఆసుపతుల్రకు వచ్చే వారికి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారని డివిజనల్ మెడికల్ అధికారి శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు వీఐపీ లాంజ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గుత్తి నుంచి రేణిగుంట వరకు పలు రైల్వేస్టేషన్లను పరిశీలించామన్నారు.