ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 03, 2022, 01:49 PM

డిసెంబరు 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా "దివ్యాంగుల హక్కుల సాధన సమితి" అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అయిన గన్నామంతి బాలాజి కుమార్ మాట్లాడుతూ.. ముందుగా దివ్యాంగులందరికి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగులకు ప్రభుత్వం 5000 పెన్షన్ ఇచ్చి, చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని మరియు చదువు లేని వారికి బ్యాంక్ నుండి సబ్సిడీ లోన్స్ ఇచ్చి వారి జీవనానికి చేయూత అందించాలని కోరారు. అర్హులైన వారికి త్రీ వీలర్ స్కూటర్ లు తక్షణమే అమలు చేయాలని కోరారు మరియు ప్రభుత్వ దృష్టికి వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని, ఒంటరిగా ఉన్న వికలాంగులకు కూడా ప్రభుత్వ భూమి ఇచ్చి ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గగ్గుటూరి మస్తాన్ వలి మొదలగు దివ్యాంగులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com