భారత స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ గాయం బారిన పడ్డాడు. దీంతో బంగ్లాదేశ్ పర్యటనకు దూరం అయ్యాడు. షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. భుజం గాయంతో బాధపడుతున్న షమీ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో BCCI మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న ఫొటోలను షమీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తన కెరీర్లో చాలా సార్లు గాయాల బారిన పడ్డానని, తాను ఎన్నిసార్లు గాయపడినా, వాటి నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపాడు. గాయం నుంచి కోలుకుని తిరిగి మరింత శక్తివంతంగా జట్టులోకి తిరిగి రావాలని అనుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు.