దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రాప్తిస్తుందని ఎంపీపీ ప్రతినిధి తమ్మినేని శ్రీరామ్ మూర్తి అన్నారు. ఆమదాలవలస మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ ప్రతినిధి తమ్మినేని శ్రీరామమూర్తి మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తుందని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన ప్రతిభను చూపించి ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.