టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకొంది. పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది. తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్న సంగతి తెలిసిందే. జనవరి 2న శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి.. గతంలో లాగా పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నారు. పదిరోజులకు తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు ఇస్తారు. వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు చేసింది.
జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశి.. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తారు. దర్శన టికెట్లు ఉన్న వారికి మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. టికెట్లు లేని వారిని దర్శనానికి అనుమతి ఉండదు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రోజుకు 25 వేలు, సర్వదర్శనం టికెట్లు రోజుకి 50 వేల టికెట్లు కేటాయిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం పదిరోజుల కి 5 లక్షల సర్వదర్శనం టికెట్లు కేటాయించనున్నారు. సర్వదర్శన టికెట్లు తిరుపతిలో తొమ్మిది కేంద్రాలు, తిరుమలలో ఒక్క కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.
రోజుకి 50 వేల టికెట్లు కేటాయిస్తారు. ఈ టికెట్లకు సంబంధించి ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. ఇక ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశారు. శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్ రోజుకి 2 వేల టికెట్లు కేటాయిస్తారు. శ్రీవాణి టికెట్లు కలిగిన వారికి మహాలఘు దర్శనం కల్పిస్తారు. పోలీసులు, జిల్లా అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాటు చేస్తారు. గోవిందమాల భక్తులు కూడా టికెట్లు తీసుకునే రావాలి..వారికి ప్రత్యేక దర్శనాలు ఉండవు.
టికెట్లు లేని భక్తులు తిరుమలకి రావొచ్చు.. కాని దర్శనానికి అనుమతి ఉండదు. డిసెంబరు 29 నుంచి జనవరి 3 వరకు వసతి రిజర్వేషన్ రద్దు చేశారు. సీఆర్వో దగ్గర అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. వసతి విషయంలో అవకతవకలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వెనుకబడిన ప్రాంతాల నుంచి వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తారు. పది రోజుల్లో పదివేల మందికి దర్శనం చేయిస్తామన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది , శాంతిభద్రతల ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
జనవరి 2న వేకువజామున 1:40 నుండి వీఐపీ దర్శనం ఉంటుంది. ఉదయం 5 గంటలకు సామాన్య భక్తులకు దర్శనాలకు అనుమతి ఇస్తారు. జనవరి రెండున వైకుంఠ ఏకాదశి నాడు బంగారు తెరు, మూడన ద్వాదశి నాడు చక్రస్నానం నిర్వహిస్తారు. టికెట్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి రావాలని టీటీడీ సూచించింది. జనవరి 2న కూడా రాజ్యాంగ హోదాలో వీఐపీలు స్వయంగా వస్తే మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది.