బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉంది. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ పై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఫలితంగా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు. ఈ తుపానుకు 'మాండస్' అని పేరు పెట్టింది యూఏఈ. అరబిక్ బాషలో మాండస్ అంటే నిధుల పెట్టె! ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడనున్న రెండో తుపాను ఈ మాండస్. అక్టోబర్లో సిత్రంగ్ తుపాను.. బంగ్లాదేశ్లో బీభత్సం సృష్టించింది. ఇక ఇప్పుడు.. మాండస్ తుపాను ఈ నెల 8న తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.