చిరుతలు బయట వేటాడడం మనం చూశాం. అవి దేన్నైనా వేటాడాలంటే ఎర కోసం ఎంత ఓపికగా, వేగంగా ఉంటాయో మనకు తెలుసు. కానీ చిరుతలు అంతే వేగంగా నీటిలోనూ ఓ చిన్న ఎర కోసం వేటాడుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ చిరుత తన చిన్న ఎర కోసం వేగంగా కదులుతుంది. అంతే కాకుండా గాలి పీల్చుకోకుండా నీటిలోనే తన వేటను తింటూ కనిపిస్తోంది. ఓ వ్యక్తి దీన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా వైరల్ అయ్యింది. అయితే చిరుత ఎక్కడున్నా టార్గెట్ మిస్ కాదని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa