జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం’ అంటూ బుధవారం ఒక వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. తన పర్యటనల కోసం సిద్ధం చేసిన వాహనం వీడియోను విడుదల చేశారు. ఈ వాహనాన్ని బుధవారం హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ కి ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోనూ ఆయన చర్చించారు. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. వారాహి అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయి. దుర్గాదేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. ఈ వాహనానికి తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa