విజయవాడ, సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సెలూన్లో వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ప్రసాదంపాడుకు చెందిన ఓ మహిళ సెలూన్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తూ వ్యవహారం నడిపిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి యువతలను తీసుకువచ్చి వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సెలూన్‌పై దాడి చేసి ఏడుగురు యువకులు, ఎనిమిది మంది యువతలను అదుపులోకి తీసుకున్నారు. సెలూన్‌ను నగరంలో సీఐ తండ్రి లీజుకు తీసుకుని వేరే వ్యక్తితో నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు నివేదికను ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలుస్తోంది.