బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం కారణంగా చెన్నూరు మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. చెన్నూరు మండల వ్యాప్తంగా రైతుల సాగుచేసిన వరి, వేరుశనగ, మినుము, నువ్వులు, పొద్దు తిరుగుడు, శనిగా, పసుపు ఎక్కడ దెబ్బతింటాయన్నని రైతుల ఆందోళన చెందుతున్నారు.
కొన్ని గ్రామాల్లో వరి సాగు కోత దశలో ఉండడంతో రైతులను మరింత కుంగతీస్తున్నది. చెన్నూరు ఇటుకల పరిశ్రమ ప్రాంతాల్లో ఇటుకల పరిశ్రమలలో పచ్చటికలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ వర్షం కారణంగా మండల కేంద్రమైన చెన్నూరులో వర్షపు నీటితో రోడ్ల అద్వానంగా మారాయి. చెన్నూరు పెన్నా నదిలో నీటి ప్రవం పెరుగుతున్నది 5000 క్యూసెక్కుల పైబడి నీరు దిగుకు ప్రవహిస్తున్నది. మండలంలో ఎంత వర్షం కురుస్తున్నది తదితర వివరాలను మండల తాసిల్దార్ కార్యాలయంలో నమో చేస్తూ ఉంటారు.
ఈ విషయంపై మండల తాసిల్దారును వివరణ కోరగా అందుబాటులో లేరు. భారీ వర్షాల కారణంగా చెన్నూరు మండలం వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు పడుతుంటే రెవిన్యూ శాఖలో ఒకరిద్దరు తప్ప కార్యాలయాలకు గైర్హాజరు, ఎంపీడీవో కార్యాలయంలో కూడా అధికారులు అందుబాటులో లేరు, వీఆర్వోలు, కార్యదర్శులు ఆయా గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా అందుబాటులో లేరు. శనివారం సెలవ రోజు కావడం ఉద్యోగులు ఎవరు హాజరు కాలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఏం జరుగుతుందో అన్న ఉద్దేశంతో కొంతమంది ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చినట్లు తెలిసింది.