దళిత ఓట్లతో గద్దెనెక్కిన సీఎం జగన్మోహన్‌రెడ్డి దళితు లకు అన్ని రంగాల్లోనూ అన్యాయం చేశారని శ్రీకాకుళం టీడీపీ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్ష, కార్యదర్శులు మట్టా పురుషోత్తం, గోర సురేష్ ఆరోపించారు. శ్రీకాకుళం లోని పార్టీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో ఎస్సీలను ఆర్థికంగా, సామాజికంగా 20ఏళ్లు వెనక్కి నెట్టే శారని విమర్శించారు. దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని.. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులను పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ను మూడుముక్కలు చేశారని, ఏ విభాగానికీ పైసా నిధులు కేటాయించ కుండా దళిత నిరుద్యోగులకు అన్యాయం చేశారన్నారు. టీడీపీ హయాంలో అమలు చేసిన విదేశీ విద్య, బ్రైట్ బాయ్స్, కార్పొరేట్ విద్య, అంబేడ్కర్ ఓవర్సీస్ వంటి 25 పథకాలను వైసీపీ ప్రభుత్వం నిలిపేసిందన్నారు. ఇటువంటి చర్యలతో సీఎం జగన్ దళితద్రోహిగా చరిత్రలో నిలిచిపో యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ అధికా ర ప్రతినిధి ముదిలి సింహాచలం, కార్యద ర్శి శంకరరావు, లక్ష్మ ణరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి రాజ న్న, సారుకోట రామా రావు, బంగారు ఆది నారాయణ, రమేష్ పాల్గొన్నారు.