రానున్న ఎన్నికలలో బీజేపీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త ఓ సైనికుడిలా పని చేయాలని పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్చార్జి నడుకు దిటి ఈశ్వరరావు అన్నారు. తన క్యాంపు కార్యాలయం లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల నూతన కమిటీ ఎన్నిక కోసం కార్యకర్తల అభిప్రాయసేకరణ చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు లంక అప్పలనాయుడు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు టొంపల అప్పలరాజు, నాయకులు సంపతిరావు నాగేశ్వరరావు, గొర్లె శ్రీహరి, వెలిచేటి చిన్నమౌళి, వెలిచేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.