ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టులో సోమవారం అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెలాఖరు నుంచి అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. అనంతబాబుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతులను ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుందని తెలిపింది. తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa