రష్యా విక్రయించే చమురు ధరలపై జీ-7 దేశాలు విధించిన ఆంక్షలను భారత్ వ్యతిరేకించడంపై మాస్కో హర్షం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మనకు ఓ ఆఫర్ కూడా ప్రకటించింది. చౌక ధరలో చమురు కొనుగోళ్లను కొనసాగించేలా భారీ సామర్థ్యమున్న ఓడల నిర్మాణం, లీజు వ్యవహారంలో భారత్‌కు సహకారం అందిస్తామని రష్యా తెలిపింది. గత శుక్రవారం మాస్కోలోని భారత రాయబారి పవన్ కపూర్‌తో రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ సమావేశమయ్యారు. ఈ భేటీలోనే నోవాక్ ఈ ఆఫర్‌ను ప్రకటించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రటకనలో వెల్లడించింది.