సాధారణంగా అందరూ ఒకే రకం వంట నూనెనే వాడుతూ ఉంటారు. కానీ ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రకరకాల పోషకాలు అందాలంటే తరచుగా వంట నూనెలను మారుస్తూ ఉండాలని సూచిస్తున్నారు. నువ్వుల నూనె, వేరుశనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె, కొబ్బరి నూనె.. ఇలా వరుసగా మారుస్తూ వాడుకోవాలని చెబుతున్నారు. ఏ నూనె వాడినా రోజు మొత్తంలో ఒక చెంచాకు మించకూడదని అంటున్నారు.