వీఆర్‌ఏలు.. సీఎం జగన్మోహన్‌రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. వీఆర్‌ఏలకు గతంలో రూ.10,500 చొప్పున వేతనం వచ్చేది. 2018లో టీడీపీ ప్రభుత్వం దానిని రూ.10,885కు పెంచింది. అయితే వేతనం పెంపుపై జీవో ఇవ్వనందున.. ఈ నాలుగేళ్లలో తీసుకున్న మొత్తాన్ని (రూ.13,500) రెండు వాయిదాల్లో తిరిగి చెల్లించాలని జగన్ ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో వారి జీతాలను నిలిపివేసింది. దాంతో అనంతపురం జిల్లా యాడికి మండలంలోని 32 మంది వీఆర్‌ఏలు.. యాడికి ఎస్‌బీఐ బ్రాంచ్‌లో తొలి వాయిదా సొమ్ము రూ.6,750ను ట్రెజరీ ఖాతాకు సోమవారం జమచేశారు. రూ.10,000 జీతంలో కూడా మీరు వెనక్కి కట్టమంటున్నారంటే మీరెంత గొప్ప సీఎమ్మో అర్థమవుతోంది. అని ఓ వీఆర్‌వో ఆవేదన చెందారు.